తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Mon Oct 6, 2025 9:17AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. వారాంతాలలో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచీ భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతుంటారు.
సోమవారం (అక్టోబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 83 వేల 412 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వేల 68 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 9 లక్షల రూపాయలు వచ్చింది.


