తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Tue Sep 30, 2025 9:18AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచీ కూడా భక్తులు తిరుమలేశుని దర్శనానికి వస్తుంటారు. అటువంటి తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్త జన సంద్రంగా మారింది.
మంగళవారం (సెప్టెంబర్ 30) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానిని 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (సెప్టెంబర్ 29) శ్రీవారిని 81 వేల 526 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 304 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 14 లక్షల రూపాయలు వచ్చింది.


