TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Sat Sep 27, 2025 9:26AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.

శనివారం (సెప్టెంబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 26) శ్రీవారిని మొత్తం 75 వేల 358 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 166 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  2 కోట్ల 58 లక్షల రూపాయలు వచ్చింది.