తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Thu Sep 25, 2025 9:24AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. గురువారం (సెప్టెంబర్ 25) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతోంది. అదే టైమ్ స్లాట్ భక్తులకు స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంటగంటన్నర సమయంలో కలుగుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 24) శ్రీవారిని 58,628 మంది దర్శించుకున్నారు. వారిలో 21,551 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల లక్షరూపాయలు వచ్చింది.


