తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Sep 24, 2025 9:41AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అటువంటి తిరుమలలో బుధవారం (సెప్టెంబర్ 24) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లో అనుమతిస్తున్నారు.
ఇక మంగళవారం (సెప్టెంబర్ 23) శ్రీవారిని మొత్తం 63 వేల 837 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 904 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 85 లక్షల రూపాయలు వచ్చింది.


