TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published on: Mon Sep 22, 2025 9:26AM

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచీ భక్తులు తిరుమలకు వచ్చి వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. అలాంటి తిరుమలలో సోమవారం (సెప్టెంబర్ 22) భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంది.

సోమవారం (సెప్టెంబర్ 22) ఉదయం  శ్రీవారి దర్శనం కోసం ఒక కంపార్ట్ మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.  ఇక ఆదివారం (సెప్టెంబర్ 21) శ్రీవారిని మొత్తం 67 వేల 408 మంది దర్శించుకున్నారు. వారిలో 16 వేల 597 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చింది.