TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Fri Sep 19, 2025 9:11AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు.

శుక్రవారం (సెప్టెంబర్ 19) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండి ఉన్నాయి. భక్తుల క్యూలైన్ శిలా తోరణం వరకూ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  20 గంటల సమయం పడుతోంది.

ఇక గురువారం(సెప్టెంబర్ 18) శ్రీవారిని మొత్తం 68 వేల 95మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 032 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 70 లక్షల  రూపాయలు వచ్చింది.