TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Wed Sep 17, 2025 9:56AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరులు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు.

మంగళవారం (సెప్టెంబర్ 16) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండి ఉన్నాయి. భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  24 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం(సెప్టెంబర్ 16) శ్రీవారిని మొత్తం 63 వేల 607 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 856 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 87 లక్షల  రూపాయలు వచ్చింది.