TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

Published on: Tue Sep 16, 2025 9:36AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరులు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు.

మంగళవారం (సెప్టెంబర్ 16) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  15 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం(సెప్టెంబర్ 15) శ్రీవారిని మొత్తం 65 వేల 66 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 620 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 13 లక్షల  రూపాయలు వచ్చింది.