తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Mon Sep 15, 2025 9:17AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరులు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు.
సోమవారం (సెప్టెంబర్ 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 77 వేల 893 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 604 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కాన ుకల ఆదాయం 3 కోట్ల 53 లక్షల రూపాయలు వచ్చింది.


