TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Published on: Thu Sep 11, 2025 9:09AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. అదే విధంగా గురువారం (సెప్టెంబర్ 11) కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 10) శ్రీవారిని మొత్తం 70 వేల 86 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 56 లక్షల రూపాయలు వచ్చింది.