TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Wed Sep 10, 2025 9:16AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (సెప్టెంబర్ 10) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక మంగళవారం (సెప్టెంబర్ 9) శ్రీవారిని మొత్తం  70 వేల 828 మంది దర్శించుకున్నారు. వారిలో  26 వేల296 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 7  లక్షల రూపాయలు వచ్చింది.