TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Published on: Tue Sep 9, 2025 9:08AM

 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రేవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. మంగళవారం (సెప్టెంబర్ 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని మొత్తం 77  వేల  117 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 765 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 10 లక్షల రూపాయలు వచ్చింది.