శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Sat Sep 6, 2025 10:00AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తిరుమల దేవుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. దీంతో తిరుమల గిరి నిత్యం భక్తుల రద్దీతో కిటకిట లాడుతుంటుంది.
శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్‌లోని భక్తులకు టీటీడీ అన్న ప్రసాదం, జల ప్రసాదం, పాలు అందిస్తున్నారు. ఇక శుక్రవారం(సెప్టెంబర్ 5) శ్రీవారిని మొత్తం 69 వేల 531 మంది దర్శించుకున్నారు. శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 1,439 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.


