TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలొ కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Thu Sep 4, 2025 9:09AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. గురువారం (సెప్టెంబర్ 4) ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సయమం పడుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 3) శ్రీవారిని మొత్తం 70 వేల 472 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 247 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 85 లక్షల రూపాయలు వచ్చింది.