తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు
Published on: Wed Sep 3, 2025 9:16AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం సె(ప్టెంబర్ 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 64 వేల 926 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 338 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 90 లక్షల రూపాయలు వచ్చింది.


