TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sun Aug 31, 2025 9:21AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఆదివారం (ఆగస్టు 31) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (ఆగస్టు30) శ్రీవారిని మొత్తం 77 వేల 295 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 779 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హూండీ కానుకల ఆదాయం 3 కోట్ల 92 లక్షల రూపాయలు వచ్చింది.