తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Sat Aug 30, 2025 9:13AM
.webp)
కలియుగ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శనివారం (ఆగస్టు 30) ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (ఆగస్టు 29) శ్రీవారిని మొత్తం 65 వేల 717 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 445 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 39 లక్షల రూపాయలు వచ్చింది.


