TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Fri Aug 29, 2025 9:33AM

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఆగస్టు 29) ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలిగేందుకు 3 గంటలకు పైగా సమయం పడుతోందిఇక గురువారం (ఆగస్టు 28) శ్రీవారిని మొత్తం 63 వేల 843 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.