TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Thu Aug 28, 2025 9:04AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (ఆగస్టు 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 77 వేల 185 మంది దర్శించుకున్నారు. వారిలో  23 వేల 98 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల ఆరు లక్షల రూపాయలు వచ్చింది.