తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sat Aug 23, 2025 8:38AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు తరలి వచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ,ర విదేశాల నుంచి కూడా తిరుమల వెంకన్న దర్శనం కోసం భక్తుల తరలి స్తుంటారు. తిరుమల నిత్యం భక్త జనసందోహంతో కిటకిట లాడుతుంటుంది.
శనివారం (ఆగస్టు 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (ఆగస్టు 22) శ్రీవారిని మొత్తం 72 వేల 67 మంది దర్శించుకున్నారు. వారిలో 25,212 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు వచ్చింది.


