TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు

Published on: Fri Apr 25, 2025 8:57AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం సమీపిస్తుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం(ఏప్రిల్ 24) శ్రీవారిని మొత్తం 58వేల 227 మంది   దర్శించుకున్నారు. వారిలో 28వేల 951 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ఆదాయం  2 కోట్ల 88 లక్షల ఆదాయం వచ్చింది.