TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Thu Feb 13, 2025 7:57AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఫిబ్రవరి 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక బుధవారం (ఫిబ్రవరి 12) శ్రీవారిని మొత్తం 70 వేల 270 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల210 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 37 లక్షల రూపాయలు వచ్చింది.