శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Tue Feb 4, 2025 8:53AM
.webp)
రథ సప్తమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మంగళవారం (ఫిబ్రవరి 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక సోమవారం (ఫిబ్రవరి 2) శ్రీవారిని మొత్తం 59 వేల 784 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 740 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 61 లక్షల రూపాయలు వచ్చింది.


