తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Published on: Thu Jan 23, 2025 8:47AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (జనవరి 23)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 6 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 62 వేల 223 మంది దర్శించుకున్నారు. వారిలో 19, 704 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 10 లక్షల రూపాయలు వచ్చింది.


