TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Wed Jan 22, 2025 7:22AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (జనవరి 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా ధర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.

కాగా మంగళవారం(జనవరి 21) స్వామి వారిని మొత్తం 60 వేల 581 మంది దర్శించుకున్నారు. వారిలో 19 వేల 228 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 4 లక్షల రూపాయలు వచ్చింది.