తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Tue Jan 21, 2025 8:37AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారం (జనవరి19)తో ముగిశాయి. సోమవారం (జనవరి 20) నుంచి సాధారణ దర్శనాలు మొదలయ్యాయి. సోమవారం (జనవరి 20) శ్రీవారిని మొత్తం 83 వేల 806 మంది దర్శించుకున్నారు.
వారిలో 23 వేల 352 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 59 లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం (జనవరి 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలకు పైగా సమయం పడుతోంది.


