TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Published on: Thu Jan 2, 2025 8:14AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (జనవరి 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో మూడు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక బుధవారం (జవనరి 1) శ్రీవారిని మొత్తం 69 వేల 630 మంది దర్శించుకున్నారు. వారిలో 18 వేల 965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 13 లక్షల రూపాయలు వచ్చింది.