తిరుమలలో రద్దీ సాధారణం
Published on: Thu Oct 24, 2024 9:02AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (అక్టోబర్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
బుధవారం (అక్టోబర్ 23) శ్రీవారిని మొత్తం 64 వేల 447 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 555 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 38 లక్షల రూపాయలు వచ్చింది.


