TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

Published on: Thu Oct 17, 2024 9:32AM

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గురువారం (అక్టోబర్ 17) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్కన భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

ఇక బుధవారం (అక్టోబర్ 16) శ్రీవారిని మొత్తం 75వేల 371 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 65 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 21 లక్షల రూపాయలు వచ్చ ింది.