TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Published on: Wed Oct 16, 2024 9:56AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (అక్టోబర్ 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండపోయాయి.

టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (అక్టోబర్ 14) శ్రావారిని మొత్తం 73వేల 891 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 423 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 53లక్షల రూపాయలు వచ్చింది.