TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Mon Oct 7, 2024 9:01AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు కలిసి రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం(అక్టోబర్ 6)  తిరుమల శ్రీవారిని మొత్తం 86వేల 859 మంది దర్శించుకున్నారు.

వారిలో 37వేల 173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 63లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం(అక్టోబర్ 7) అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది.

ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.