తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Fri Oct 4, 2024 9:18AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం(అక్టోబర్ 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక గురువారం శ్రీవారిని మొత్తం 63వేల 376 మంది దర్శించుకున్నారు. వారిలో 25వేల 146 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుడీ కానుకల ఆదాయం 3 కోట్ల 56లక్షల రూపాయలు వచ్చింది.


