TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Thu Oct 3, 2024 7:03AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (అక్టోబర్ 2) శ్రీవారిని మొత్తం 80వేల 613 మంది దర్శించు కున్నారు. వారిలో 24 వేల 403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 

శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 92లక్షల రూపాయలు వచ్చింది. ఇక గురువారం (అక్టోబర్ 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.