TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue Oct 1, 2024 10:11AM

 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (అక్టోబర్ 1)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.

భక్తుల క్యూలైన్ క్యూ కాంప్లెక్స్ దాటి టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18  గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక సోమవారం (సెప్టెంబర్ 30) శ్రీవారిని మొత్తం 66 వేల 986 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 163 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 5 కోట్ల 5 లక్షల రూపాయలు వచ్చింది.