శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Mon Sep 30, 2024 9:18AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారం మధ్యలో ఒకింత తక్కువగా ఉన్న శ్రీవారి భక్తుల రద్దీ వారాంతంలో పెరిగింది. సోమవారం (సెప్టెంబర్ 30) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తులు క్యూలైన్ క్యూ కాంప్లెక్స్ దాటి ఏటీసీ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం (సెప్టెంబర్ 29) శ్రీవారిని మొత్తం 84 వేల 66 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 44 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.


