శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Fri Sep 20, 2024 9:04AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (సెప్టెంబర్ 19) శ్రీవారిని మొత్తం 68 వేల 835 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 883 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 96లక్షల రూపాయలు వచ్చింది.
ఇక శుక్రవారం (సెప్టెంబర్ 20) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


