తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Wed Sep 18, 2024 9:20AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (సెప్టెంబర్ 18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
క్యూ కాంప్లెక్స్ దాటి భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం తిరుమలేశుని మొత్తం 72 వేల 072 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 16లక్షల రూపాయలు వచ్చింది.


