తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Tue Sep 17, 2024 8:38AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (సెప్టెంబర్ 17)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ క్యూకాంప్లెక్స్ బయటకు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 76వేల 200 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 492 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 61లక్షల రూపాయలు వచ్చింది.


