తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published on: Sat Sep 7, 2024 8:40AM
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం (సెప్టెంబర్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు.
దర్శనం.ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 58,100 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 20 వేల 817 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చింది.


