TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలేశుని సర్వదర్శనానికి ఆరు గంటలు

Published on: Fri Sep 6, 2024 9:09AM

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల రద్దీ తగ్గడంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం నిల్వలు పెరిగాయి. దీంతో ఆధార్ కార్డుపై పది లడ్డూలు జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.

శుక్రవారం (సెప్టెంబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎనిమిది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

ఇక గురువారం (సెప్టెంబర్ 5) శ్రీవారిని మొత్తం 61 వేల 142 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 525 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చింది.