శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు
Published on: Thu Sep 5, 2024 9:42AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (సెప్టెంబర్ 5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం (సెప్టెంబర్ 4) స్వామివారిని 57 వేల 390 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 628 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 45లక్షల రూపాయలు వచ్చింది.


