TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published on: Wed Sep 4, 2024 9:36AM

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ఏపీకి మరో వాయుగుండం పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో భక్తల రద్దీ తగ్గింది.

బుధవారం (సెప్టెంబర్ 4)ఉదయం భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యైలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల కంటే తక్కువ సమయం పడుతోంది.

ఇక మంగళవారం (సెప్టెబర్ 3) శ్రీవారిని మొత్తం 57 వేల 817 మంది దర్శించుకున్నారు. వారిలో 17 వేల 592 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 53లక్సల రూపాయలు వచ్చింది.