TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Mon Sep 2, 2024 9:13AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (సెప్టెంబర్  2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్ లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం ( సెప్టెంబర్ 1) శ్రీవారిని మొత్తం 74 వేల 498 మంది దర్శించుకున్నారు.

వారిలో పాతిక వేల 355 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల ఆరు లక్షల రూపాయలు వచ్చింది.