TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Fri Aug 30, 2024 9:33AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం (ఆగస్టు 30)  ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి

భక్తుల క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం ( ఆగస్టు 29) మొత్తం 62 వేల 529 మంది శ్రీవారిని దర్శించుకున్నారు.

వారిలో 29 వేల 730 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 51 లక్షల రూపాయలు వచ్చింది.