తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Thu Aug 29, 2024 9:25AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (ఆగస్టు 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (ఆగస్టు 28) శ్రీవారిని మొత్తం 76 వేల 772 మంది దర్శించుకున్నారు.
వారిలో 30 వేల 293 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల82లక్షల రూపాయలు వచ్చింది.


