TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

Published on: Tue Aug 27, 2024 8:53AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారం ఆరంభంలో కూడా తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం (ఆగస్టు 27)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (ఆగస్టు 26) శ్రీవారిని మొత్తం 76 వేల 910 మంది దర్శించుకున్నారు.

వారిలో 30 వేల 320 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 26 లక్షల రూపాయలు వచ్చింది.