TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Sat Aug 24, 2024 9:10AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం (ఆగస్టు 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం (ఆగస్టు 23) శ్రీవారిని మొత్తం 69 వేల 98 మంది దర్శించుకున్నారు.

వారిలో 34 వేల 707 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 56 లక్షల రూపాయలు వచ్చింది.