తిరుమల హుండీ కానుకల ఆదాయం రూ.4 కోట్ల 21 లక్షలు
Published on: Mon Aug 19, 2024 10:43AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఆగస్టు 18) శ్రీవారిని మొత్తం 85వేల 935 మంది దర్శించుకున్నారు. వారిలో 40వేల 60 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 21 లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (ఆగస్టు 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.


