TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sun Aug 18, 2024 8:14AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఆగస్టు 18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.

భక్తుల క్యూలైన్ ఎటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం (ఆగస్టు 17) శ్రీవారిని మొత్తం 77 వేల 807 మంది దర్శించుకున్నారు.

వారిలో 38 వేల 340 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 2 లక్షల రూపాయలు వచ్చింది.